: సచిన్ లేని జట్టా.. ఊహించుకోలేకపోతున్నా: కోహ్లీ


భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరికొన్ని వారాల్లో క్రికెట్ నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో సహచరులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. సచిన్ లేని జట్టును ఊహించుకోలేకపోతున్నామని టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఆసీస్ జట్టుతో రేపు జైపూర్లో రెండో వన్డే జరగనుంది. ఆ మ్యాచ్ కోసం సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ప్రాక్టీసు చేస్తున్న కోహ్లీ.. మాస్టర్ వీడ్కోలుపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. సచిన్ ను మ్యాచ్ విన్నర్ గా అభివర్ణిస్తూ, సచినే తమకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చాడు. అతని ఆట చూస్తూ పెరిగానని, కెరీర్ తొలినాళ్ళలో అతనిలా ఆడాలని భావించేవాడినని పేర్కొన్నాడు. సచిన్ ఆటకు గుడ్ బై చెబితే ఆ ప్రభావం జట్టు మొత్తమ్మీద పడుతుందని అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News