: టీడీపీ ఎంపీల బండారం బట్టబయలైంది: జోగి రమేష్
స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన నోట్ తో రాజీనామాలంటూ టీడీపీ ఎంపీలు ఆడుతున్న నాటకాలు బయటపడ్డాయని వైఎస్సార్సీపీ నేత జోగి రమేశ్ ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిలానే ఆ పార్టీ ఎంపీలు కూడా నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. టీడీపీ సమైక్యవాదానికి కట్టుబడిలేదన్న సంగతి సీమాంధ్రప్రజలు గమనించాలని ఆయన సూచించారు. వైఎస్సార్సీపీ మాత్రమే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.