: వృత్తి పట్ల నిబద్ధతతో పని చేయాలి: అడిషనల్ డీజీపీ వీకే సింగ్
పోలీసులు వృత్తి పట్ల నిబద్ధతతో పని చేయాలని అడిషనల్ డీజీపీ వీకే సింగ్ అన్నారు. వరంగల్ జిల్లా మామునూర్ ఏపీఎస్పీ నాల్గవ బెటాలియన్ లో 265 మంది కానిస్టేబుళ్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన దీక్షాంత్ పరేడ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం ద్వారా ప్రజలకు మంచి సేవలు చేయొచ్చని అన్నారు.