: ఉత్సాహంగా అలయ్ బలయ్
దసరా సందర్భంగా బీజేపీ నేత బండారు దత్తాత్రేయ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని వివరించేలా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా జీవించేలా అలయ్ బలయ్ కార్యక్రమం స్ఫూర్తినిస్తుందని దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహిస్తామని దత్తాత్రేయ చెప్పారు.