: నోబెల్ శాంతి బహుమతి నాది: సిరియా అధ్యక్షుడు


సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ సరదాగానే అయినా సంచలన వ్యాఖ్య చేశారు. నోబెల్ శాంతి పురస్కారం తనకిచ్చి ఉండాల్సిందన్నారు. రసాయనిక ఆయుధాల నిరోధక సంస్థ(ఓపీసీడబ్ల్యూ)కు ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మానవులకు ముప్పుగా మారిన రసాయనిక ఆయుధాలను నిర్వీర్యం చేసేందుకు ఈ సంస్థ పాటుపడుతూ ఉంటుంది.

ఇటీవల సొంత ప్రజలపైనే సిరియా అధ్యక్షుడు అస్సాద్ రసాయనిక ఆయుధాల దాడికి అనుమతించడం.. డమాస్కస్ లో 1400 మంది మరణించడం తెలిసిందే. ఈ ఘటన తర్వాత అమెరికా సిరియాపై యుద్ధానికీ సిద్ధమైంది. రష్యా మధ్యవర్తిత్వంతో తమ దగ్గరున్న రసాయనిక ఆయుధాలను అంతర్జాతీయ సమాజం ఆధ్వర్యంలో నిర్వీర్యం చేయడానికి సిరియా ఒప్పుకుంది. ప్రస్తుతం ఆ పనులను ఓపీసీడబ్ల్యూనే పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఓపీసీడబ్ల్యూకి ఇచ్చిన బహుమతి తనదేనని అస్సాద్ చెప్పారు. అంటే తనవల్లే ఆ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం వచ్చింది కనుక అది తనదేనని పరోక్షంగా చెప్పినట్లయింది.

  • Loading...

More Telugu News