: చంద్రబాబు కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు
కాలేయ సమస్యలకు చికిత్స పొందుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు నేడు హైదరాబాదులోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేత గరికపాటి రామమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. బాబుకు నేడు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తారని గరికపాటి తెలిపారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. బాబు ఢిల్లీలో ఐదు రోజుల పాటు దీక్ష చేయగా, పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.