: ఎయిరిండియా వారి శాండ్ విచ్ లో పురుగులు


ఎయిరిండియా విమానం ఎక్కి, హాయిగా ఓ శాండ్ విచ్ లాగిద్దామనుకున్న ఈ ప్రయాణికుడికి వాంతయినంత పనైంది. ఆ శాండ్ విచ్ లో పురుగులుండడమే అందుకు కారణం. న్యూయార్క్- ఢిల్లీ ఫ్లయిట్ లో చోటు చేసుకుందీ ఘటన. విమానం ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఈ రాజౌరీ గార్డెన్ వాసి ఎయిరిండియా అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో మరోసారి ఈ విషయమై అధికారులను ప్రశ్నించగా.. ఆ వంటల తయారీదారుపై సరైన చర్యే తీసుకున్నామంటూ జవాబిచ్చారు. ఇది చాలా అరుదైన సంఘటనగా వారు పేర్కొన్నారు. కఠిన వడపోతల తర్వాతే క్యాటరర్ ను ఎంపిక చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News