: సోనియా వాగ్దానం చేశారట.. అందుకని వెనక్కి తగ్గరట: రాయపాటి


తెలంగాణపై సోనియా గాంధీ వాగ్దానం చేశారన్న కారణంతోనే కాంగ్రెస్ అధిష్ఠానం వెనక్కి తగ్గేది లేదంటోందని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాజీనామాలపై నేరుగా మాట్లాడాలని తనకు వర్తమానం అందిందని అన్నారు. తాను రాజీనామా ఆమోదించుకునేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. 5 లక్షల కోట్ల ప్యాకేజీ అంటే డబ్బు వస్తుంది, నగర నిర్మాణం జరుగుతుందే తప్ప భవిష్యత్ తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. దీనిపై కేంద్రం మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయానికి విలువ లేనట్టు కన్పిస్తోందని ఆయన అధిష్ఠానంపై మండిపడ్డారు.

  • Loading...

More Telugu News