: మళ్లీ ఘాటెక్కుతున్న ఉల్లి
దేశంలో ఉల్లి ధర మళ్లీ పెరుగుతోంది. దసరా నవరాత్రులు, బక్రీద్ పండుగలకు తోడు, దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాల కారణంగా ఉల్లి ధరలకు రెక్కలు వస్తున్నాయి. కిలో ఉల్లి ఉత్తరాది రాష్ట్రాలలో 60 రూపాయల నుంచి 70 రూపాయలు పలుకుతోంది. ఢిల్లీలో హోల్ సేల్ ధరే కిలో 62 రూపాయలుగా ఉంది.