: జగన్ పిటిషన్ పై విచారణ ఈ నెల 18కి వాయిదా
హైదరాబాదు విడిచి వెళ్ళేందుకు అనుమతించాలంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. జగన్ పిటిషన్ పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. జగన్ కు బెయిల్ ఇచ్చే సమయంలో హైదరాబాదు విడిచి వెళ్ళరాదని కోర్టు షరతు విధించిన సంగతి తెలిసిందే.