: దేవరగట్టులో ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఉత్సవం
కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవం ముగిసింది. ఈ ఉత్సవం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇనుప తొడుగులు ఉన్న కర్రలను తొలగించేందుకు, భక్తులు హెల్మెట్లను ధరించేందుకు, మద్యం మోతాదును తగ్గించేందుకు అధికారులు ఎన్నో చర్యలు తీసుకున్నా... అనుకున్న స్థాయిలో సఫలీకృతం కాలేకపోయారు. కర్రలతో కొట్టుకునే ఈ ఉత్సవంలో మొత్తం 100 మంది భక్తులు గాయపడ్డారు. దీనికితోడు, ఉత్సవం ముగిసే సమయంలో పోలీసులపై భక్తులు దాడి చేశారు. దీంతో కొంత మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ సందర్భంగా అక్కడ కొంత ఉద్రిక్తకర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, కాసేపటికే పరిస్థితి అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.