: 1200 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరణ


ఫైలిన్ తుపాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. అయితే, జిల్లా మొత్తానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనులు వాయువేగంతో కొనసాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలోని 1200 గ్రామాలకు విద్యుత్ ను పునరుద్ధరించారు. ఈ వివరాలను జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 3.60 లక్షల మందిపై ఫైలిన్ ప్రభావం పడిందని ఆయన తెలిపారు. తుపాను దెబ్బకు ఇద్దరు మృతి చెందగా, మొత్తం 86 పశువులు చనిపోయాయని అన్నారు. 38 ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయని, 362 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పారు. 5,140 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 3,219 హెక్టార్లలో కొబ్బరి పంటకు నష్టం వాటిల్లిందని కలెక్టర్ తెలిపారు.

  • Loading...

More Telugu News