: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి


తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని బొమ్మూరు వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న టవేరా వాహనం బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖపట్నం గాజువాకకు చెందిన తొమ్మిది మంది నిన్న రాత్రి విజయవాడ బయలుదేరారు. వారిలో నలుగురు భవానీ మాలలో ఉన్నారు. బొమ్మూరు వద్దకు రాగానే తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని గమనించిన అటుగా వెళుతున్న ప్రయాణికులు 108 అంబులెన్సుకు, పోలీసులకు సమాచారమందించారు. గాయపడిన వారిని 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News