: చిప్స్‌ ఎక్కువగా తింటున్నారా...


ప్రయాణాల్లోను, లేదా సినిమా చూసే సమయంలోను, టైంపాస్‌కోసం మనలో చాలామంది చేసేపని చిప్స్‌ లాంటివి తినడం. ఇలాంటివి తినడం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముందని పరిశోధకులు చెబుతున్నారు. కరకరలాడే చిప్స్‌ని ఎవరైనా ఇష్టంగా తింటారు. కానీ వాటివల్లే మనకు అనారోగ్యం వస్తుందని తక్కువమందికి తెలుసు. లండన్‌లోని ఒక పరిశోధనా బృందం చిప్స్‌, బిస్కెట్లు వంటివి తినేవారిపై నిర్వహించిన ఒక పరిశోధనలో చిప్స్‌ వంటివి ఎక్కువ తినడం వల్ల క్యాన్సర్‌కి దారితీసే ప్రమాదముందని తేలింది.

ఎక్కడ చూసినా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో వేడి వేడి చిప్స్‌ వేస్తుంటారు. వాటిని మనం ఎంతో ఇష్టంగా తింటాం. ఇలాంటి వాటిని తినకూడదని, వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడడం వల్ల, అలాంటి నూనెలో వేయించిన చిప్స్‌లో అక్రైలమైడ్‌ అనే రసాయనం విడుదలై అది క్యాన్సరుకు దారితీస్తుందని లండన్‌ రీడింగ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు క్యాన్సర్‌కు దారితీసే కారణాల మీద చేస్తున్న ప్రయోగాల్లో తేలింది. అలాగే బిస్కెట్లు, బ్రెడ్‌ వంటి పదార్ధాల్లో కూడా ఈ రసాయనం తప్పకుండా ఉత్పత్తి అయితీరుతుందని, కాబట్టి అలాంటివి తినడం వల్ల కూడా క్యాన్సర్‌ వచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి చిప్స్‌ వంటివి తినాలనుకుంటే చక్కగా ఇంట్లోనే చేసుకుని తినేందుకు ప్రయత్నిస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

  • Loading...

More Telugu News