: పవర్ స్టార్ స్టామినా సరిగ్గా చెప్పగలిగేది వాళ్ళే..: రఘుబాబు
'పవర్ స్టార్ స్టామినా సరిగ్గా చెప్పగలిగేది అభిమానులే' అని నటుడు రఘుబాబు ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే పైరసీకి గురైనా, పవన్ కల్యాణ్ సత్తా ఏంటో నిరూపితమైందని, చిత్ర ఘనవిజయం ఆ విషయాన్ని స్పష్టం చేస్తోందని రఘుబాబు చెప్పారు. సినిమా థాంక్స్ గివింగ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ రఘుబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.