: సచిన్ 200వ టెస్టు వేదికపై రేపు నిర్ణయం


బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 200వ టెస్టుకు వేదికను బీసీసీఐ రేపు ఖరారు చేయనుంది. ముంబయిలో రేపు జరిగే బీసీసీఐ టూర్ షెడ్యూల్ కమిటీ సమావేశంలో విండీస్ తో మ్యాచ్ లకు వేదికలు నిర్ణయిస్తారు. సచిన్ ఇప్పటివరకు 198 టెస్టులాడాడు. వచ్చే నెలలో విండీస్ జట్టుతో భారత్ రెండు టెస్టులాడనుంది. ఈ సిరీస్ లో రెండో టెస్టు సచిన్ కు 200వ టెస్టు అవుతుంది. సొంతగడ్డ ముంబయిలో కెరీర్ చివరి టెస్టు ఆడాలనుందని సచిన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోర్డు కూడా సచిన్ కోరికను మన్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ కూడా ఈ విషయంలో సుముఖంగా ఉందని ముంబయి క్రికెట్ సంఘం అధ్యక్షుడు రవి సావంత్ చెప్పారు.

  • Loading...

More Telugu News