: చిత్తూరు జిల్లాలో ఉగ్రవాదుల కలకలం
చిత్తూరు జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల కలకలం రేగింది. పుంగనూరులో అనుమానిత వ్యక్తులు ఉన్నారన్న సమాచారంతో భద్రత బలగాలను అక్కడికి తరలించారు. అక్కడి ఉబేదుల్లా కాంపౌండ్ లో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం జిల్లాలోని పుత్తూరులో సుదీర్ఘ ఆపరేషన్ అనంతరం ఏడుగురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారిలో ముగ్గురు అల్ ఉమా తీవ్రవాదులున్నారు. ఇంకా ముగ్గురు పిల్లలు, ఓ మహిళ కూడా ఉన్నారు.