: వైఎస్సార్సీపీ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా
హైదరాబాదులో సమైక్య శంఖారావం సభ నిర్వహించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ నెల 19న సభ జరపాలని వైఎస్సార్సీపీ అధినాయకత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా, శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందన్న కారణంతో పోలీస్ శాఖ ఈ సభకు అనుమతి నిరాకరించింది. దీనిపై, పార్టీనేత జూపూడి ప్రభాకర్ రావు ఇంతకుముందు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడి అనుమతి తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.