: సిరియాలో కారు బాంబు పేలి 20 మంది మృతి


సిరియాలో కారుబాంబు పేలిన ఘటనలో 20 మంది అసువులు బాశారు. పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. దీంతో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇద్లిబ్ ప్రావిన్స్ లోని దార్కుష్ నగరంలో ఈ ఘటన జరిగింది. కాగా, ఆదివారం సాయంత్రం డమాస్కస్ లో ప్రభుత్వ టీవీ కేంద్రం వద్ద ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులు పేలుడు పదార్ధాలు ఉన్న కార్లను పేల్చివేశారు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే దార్కుష్ లో కారుబాంబు పేలుడు చోటు చేసుకోవడం సిరియా ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.

  • Loading...

More Telugu News