: చెత్త షాట్లే కొంపముంచాయంటున్న ధోనీ


ఆసీస్ తో తొలి వన్డేలో ఘోర పరాజయం పాలవడం పట్ల మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. బౌలర్ల పేలవ ప్రదర్శనకు బ్యాట్స్ మెన్ ల చెత్త షాట్ సెలక్షన్ తోడవడంతో ఓటమి తప్పలేదని సూత్రీకరించాడు. భారీ భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమయ్యామని అంగీకరించాడు. ఓ దశలో పటిష్ట స్థితిలో నిలిచినా, బ్యాట్స్ మెన్ వికెట్లు పారేసుకోవడంతో మ్యాచ్ ఆసీస్ వైపు మొగ్గిందని చెప్పుకొచ్చాడు. లక్ష్య ఛేదన చేసేటప్పుడు మిడిల్ ఓవర్లలో వికెట్లు నిలుపుకోవడం చాలా ముఖ్యమని తెలిపాడు.

ఇక బౌలర్ల ప్రదర్శనపై మాట్లాడుతూ, సిసలైన ఫాస్ట్ బౌలర్లు కరవయ్యారని వాపోయాడు. స్వింగ్ బౌలర్లు ఉన్నా, ఆసీస్ పేసర్లలాగా బౌన్స్ రాబట్టడంలో వారు విఫలమయ్యారని పేర్కొన్నాడు. ఏడు వన్డేల సిరీస్ లో భాగంగా నిన్న పుణేలో జరిగిన మ్యాచ్ లో భారత్ 72 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలుపుతో ఆసీస్ 1-0తో సిరీస్ లో ముందంజ వేసింది.

  • Loading...

More Telugu News