: అమెరికాలో 'బతుకమ్మ' వేడుకలు
తెలంగాణ ప్రాంతంలో విశేషంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలను అమెరికాలోనూ ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజెల్స్ లోని తెలంగాణ నార్త్ అమెరికన్ అసోసియేషన్ ఈ సంబరాలను నిర్వహించింది. ఈ వేడుకల్లో 60 శాతం మంది కరీంనగర్ జిల్లాకు చెందినవారే ఉన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు. బతుకమ్మలను సమీపంలోని సరస్సులో నిమజ్జనం చేశారు. అనంతరం విందు భోజనాలు ఏర్పాటు చేశారు.