: ఒక్కరోజే 5 లక్షల టిక్కెట్లు బుక్..ఐఆర్ సీటీసీ రికార్డు
ఐఆర్ సీటీసీ..రైల్వే ప్రయాణీకుల ఆన్ లైన్ రిజర్వేషన్ సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ వెబ్ సైట్ శుక్రవారం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేవలం నిన్న ఒక్కరోజే 5 లక్షలకు పైగా టిక్కెట్లను ఆన్ లైన్ లో ప్రయాణీకులు రిజర్వేషన్ చేయించుకున్నారు. రైల్వే బడ్జెట్ లో ఐఆర్ సీటీసీ ఇక్కట్లను ఏడాది చివరికి తొలగిస్తామని రైల్వే మంత్రి పవన్ కుమార్ భన్సల్ ప్రకటించడంతో పాటు, సెలవు రోజులు.. పండగ రోజులు కావడంతో రికార్డు స్థాయి టిక్కెట్లు అమ్మినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.