: కాంగ్రెస్ పార్టీది మోసపూరిత వైఖరి: రాఘవులు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఆ పార్టీది మోసపూరితమైన వైఖరి అని దుయ్యబట్టారు. విభజనపై సమన్యాయం చేస్తామంటూ దిగ్విజయ్ సింగ్ చెబుతున్న మాటలు కేవలం మీడియాకే పరిమితమవడం కాంగ్రెస్ దగాకోరు వైఖరికి నిదర్శనమన్నారు. తనను కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులతో భేటీ అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడారు. తాము మొదటి నుంచి సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు. సీమాంధ్రలో ఉద్యమం చేస్తున్న ఇతర జేఏసీలతోనూ సర్కారు చర్చలు జరపాలని సూచించారు. హైదరాబాదులో కూర్చుని సమైక్యవాణిని వినిపిస్తున్న సీఎం కిరణ్ ఢిల్లీలో ఎందుకు మాట్లాడరని రాఘవులు ప్రశ్నించారు.