: భారత్-ఆసీస్ వన్డేలపై బెట్టింగులు.. రాజమండ్రిలో ముగ్గురు అరెస్ట్
భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ లపై బెట్టింగులకు పాల్పడుతున్న ముగ్గురిని రాజమండ్రిలో నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తిలక్ రోడ్డులోని ఒక ఇంటిపై దాడి చేసి వీరిని పట్టుకున్నారు. 12 సెల్ ఫోన్లు, 6 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ముగ్గురూ అనపర్తికి చెందినవారని పోలీసులు తెలిపారు.