: యూపీలో మంత్రులు, ఎమ్మెల్యేలను బెదిరిస్తున్న గుర్తుతెలియని మహిళ


మొబైల్ మోగిందంటే చాలు ఉత్తరప్రదేశ్ (యూపీ) మంత్రులు, ఎమ్మెల్యేలు హడలిపోతున్నారు. ఓ మహిళ స్వరం వారికి చెమటలు పట్టిస్తోంది. గుర్తు తెలియని మహిళ తనను వేధిస్తోందంటూ యూపీ క్రీడా మంత్రి నరద్ రాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ఆమె ఫోన్ కాల్స్ ద్వారా బెదిరిస్తున్నట్లు తెలిపారు. తనతోపాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా సదరు మహిళ ఇబ్బందులకు గురి చేస్తోందని ఫిర్యాదు చేశారు. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందేమోనంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News