: ప్రభాకరన్ కుమారుడ్ని మేం చంపలేదు: రాజపక్స


ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ చిన్న కుమారుడు బాలచంద్రన్ ను శ్రీలంక సైన్యం చంపినట్టుగా వెల్లువెత్తుతోన్న ఆరో్పణలను ఆ దేశ అధ్యక్షుడు మహింద రాజపక్స ఖండించారు. ఎల్టీటీఈతో పోరు సందర్బంగా లంక సైన్యం కిరాతకంగా వ్యవహరించిందని బ్రిటన్ కు చెందిన చానల్-4 ఓ డాక్యుమెంటరీలో ఆరోపించింది.

ఓ నేలమాళిగలో దాక్కున్న ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్ తినుబండారాలు తింటున్నట్టు మొదట ఓ ఫొటో, తర్వాత బుల్లెట్లతో ఛాతీ ఛిద్రమైన స్థితిలో మరో ఫొటోను చానెల్-4 తన డాక్యుమెంటరీలో ప్రదర్శించింది. దీంతో అంతర్జాతీయ సమాజం లంక యుద్ధ నేరాలకు పాల్పడిందంటూ ఎలుగెత్తింది. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో కూడా లంక తమిళుల పట్ల సింహళ సైన్యం వ్యహరించిన తీరుపై నిరసనలు పెల్లుబికాయి.

ఇక స్పందించక తప్పని పరిస్థితిలో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స.. తమ సైన్యం బాలచంద్రన్ ను చంపలేదని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'అతన్నిసైన్యమే చంపి ఉంటే ఆ విషయం నాకు తెలిసేది. ఒకవేళ సాయుధ దళాల్లో ఎవరైనా చంపి ఉంటే, అందుకు నాదే బాధ్యత. ఏదేమైనా ఈ విషయాన్ని ఖండిస్తున్నాం' అని పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News