: బాబును పరామర్శించిన బాలకృష్ణ
హైదరాబాదులోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. వైద్యులను అడిగి బాబు ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. కాగా, ఢిల్లీలో నిరాహార దీక్ష చేయడం మూలంగా బాబుకు కాలేయంలో సమస్యలు తలెత్తాయి. ఆయన కామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాదు చేరుకోగానే బాబు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేరారు. ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.