: హృదయంలేని తల్లిదండ్రులు వీళ్ళు..


పిల్లలను ఒంటరిగా వదిలి ఎక్కడికైనా వెళ్ళాలంటే మనసున్న వాళ్ళకు ఎంతో కష్టంగా ఉంటుంది. కానీ, ఈ తల్లిదండ్రులు మాత్రం కర్కోటకుల్లా వ్యవహరించారు. గుంటూరులో ఏడాది వయసున్న చిన్నారిని వదిలించుకునేందుకు యత్నించి, ఆ పసికందు ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. వివరాల్లోకెళితే.. చిన్నారికి మద్యం తాగించి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వదిలివెళ్ళారా కసాయి తల్లిదండ్రులు. మద్యం ప్రభావంతో ఆ పాప మరణించింది. ఈ విషయాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఆ దుర్మార్గపు తల్లిదండ్రులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News