: మత ఘర్షణల బాధితులకు రూ. 7కోట్ల పరిహారం
ముజఫర్ నగర్ మత ఘర్షణల బాధితులకు సాయంగా 7 కోట్ల రూపాయలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. నెల క్రితం రెండు మత వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. 1054 మందిని బాధితులుగా అధికారులు గుర్తించారు. వారికి గూడు, ఇతరత్రా అవసరాల కోసం సాయంగా ఈ మొత్తాన్ని అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది.