: ముగిసిన తొలి రోజు ఆట.. భారత్ 5/0
హైదరాబాద్ టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. చివరి సెషన్ లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. ఆట ఆఖరుకు వికెట్ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. సెహ్వాగ్ 4 పరుగులతోనూ, విజయ్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ ను 237/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసి ఆసీస్ కెప్టెన్ క్లార్క్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తగా... తొలి రోజు ఆటలో మిగిలిన మూడు ఓవర్లలో భారత ఓపెనర్లను అవుట్ చేయలేక కంగారూ పేసర్లు నిరుత్సాహానికి గురయ్యారు.