: ఇంకో జన్మ ఉంటే జర్నలిస్టు అవుతా: అమితాబ్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ తనకు మరో జన్మంటూ ఉంటే విలేకరిగా పుట్టాలని ఉందని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఎందుకంటే ఎలాంటి పరిణామాలు ఎదురైనా బెదరిపోకుండా ఎదుర్కోవటం, స్వేచ్ఛగా మాట్లాడటం అనేవి ఒక్క జర్నలిస్టుకే సాధ్యమని అమితాబ్ అన్నారు. స్వేచ్ఛగా బ్రతికే జర్నలిస్టుకే ఆనందం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తాజా రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న సత్యాగ్రహ సినిమా షూటింగులో బిజీగా ఉన్న అమితాబ్ తన మనోభావాలను సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్ ద్వారా ఇలా పంచుకున్నారు.