: జైలు నుంచే జగన్ ఫిరాయింపుల ప్రణాళిక: టీడీపీ
ఫిరాయింపులకు సంబంధించిన ప్రణాళికలను చంచల్ గూడ జైలునుంచే జగన్ రచిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అంతేగాక, పార్టీ ఫిరాయింపులకు అవసరమైన డబ్బును వైఎస్ వల్ల ప్రయోజనం పొందిన పారిశ్రామికవేత్తలు సమకూరుస్తున్నారని ఆయన చెప్పారు. దీనిపై మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఫిరాయింపులను ప్రాథమికంగా ప్రోత్సహిస్తున్నది... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలున్న కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలేనని యనమల అన్నారు.