: ముఖ్యమంత్రి సోనియా ఏజెంటా? సమైక్యవాదా?: మైసూరా సూటి ప్రశ్న
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ విభజన అజెండాను అమలు చేస్తున్న ఏజెంటా? లేక సమైక్యవాదా? అని వైఎస్సార్సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి సూటిగా ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సమైక్య శంఖారావం సభకు అనుమతిని ఎందుకు నిరాకరిస్తున్నారంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యధికుల మనోభావాలను రాజధానిలో వెల్లడించే హక్కు లేదా? అని నిలదీశారు. మూడు ప్రాంతాల ప్రయోజనాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే కాపాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యధికులు రాయలసీమ, కోస్తాంధ్రల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు.