: టీడీపీ శ్రేణులు బాబు ఇంటి ముందు ధర్నా చేయాలి: వీహెచ్
తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధర్నా చేయాల్సింది సోనియా నివాసం ఎదుట కాదని, చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు సూచించారు. టీడీపీ, వైఎస్సార్సీపీలు లేఖలు ఇస్తేనే రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించారని, అదేమీ సోనియా సొంత నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన సీమాంధ్రులు నివసించే ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సోనియా ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల ధర్నాను తప్పుబట్టారు. ఇక, హైదరాబాదులో నివసించే సీమాంధ్రులకు విభజనతో సమస్యలు వస్తాయన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.