: ఈనెల 21న టీ జేఏసీ 'సడక్ బంద్'
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 21న హైదరాబాదు-బెంగళూరు రహదారిపై 'సడక్ బంద్' నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. సడక్ బంద్ తర్వాత విజయవాడ రహదారిని కూడా దిగ్బంధిస్తామని తెలంగాణ జేఏసీ నేత శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బంద్ కు ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ మేరకు సమావేశమైన జేఏసీ స్టీరింగ్ కమిటీ పలు విషయాలపై చర్చించింది.