: భారత్ ముందు భారీ లక్ష్యం
పుణే వన్డేలో భారత్ ముంగిట భారీ లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ బెయిలీ (85) టాప్ స్కోరర్. ఓపెనర్లు ఫించ్ (72), హ్యూస్ (47) తొలి వికెట్ కు 110 పరుగులు జోడించి చక్కని పునాది వేశారు. ఇక మిడిలార్డర్ లో మ్యాక్స్ వెల్ (31) అండతో బెయిలీ ఆసీస్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఇషాంత్ విసిరిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో క్లింట్ మెకాయ్ (11 నాటౌట్)వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి జట్టు స్కోరును 300 మార్కు దాటించాడు.