: మరణశిక్షపై సుప్రీం వ్యాఖ్యలు


క్రూరత్వాన్ని హేతువుగా చూపడం ద్వారా 'అత్యంత అరుదైన కేసు'గా పరిగణించి మరణశిక్ష విధింపజాలమని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. 'కంటికి కన్ను' విధానం సరికాదని పేర్కొంది. మూడు హత్యలు చేసిన ఓ వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు మరణశిక్ష విధించగా, దానిపై నిందితుడు సుప్రీంను ఆశ్రయించాడు. ఆ శిక్షను అత్యున్నత న్యాయస్థానం జీవితకాల ఖైదుగా మార్చింది. ఆ విచారణ సందర్భంగా జస్టిస్ హెచ్ఎల్ దత్తు, ఎస్ జే ముఖోపాధ్యాయ, ఎంవై ఇక్బాల్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నాగరిక సమాజంలో పంటికి పన్ను, కంటికి కన్ను తరహాలో కేసులను పరిష్కరించడం ప్రామాణికం కారాదన్నారు. దిగువ కోర్టులు మరణశిక్ష విధించేటప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బెంచ్ సూచించింది.

  • Loading...

More Telugu News