: బెట్టింగ్ చట్టబద్ధం చేయాలంటున్న జస్టిస్ ముకుల్ ముద్గల్


క్రికెట్ బెట్టింగ్ ను చట్టబద్దం చేయాలంటున్నారు హర్యానా-పంజాబ్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ముకుల్ ముద్గల్. ఐపీఎల్-6లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ అంశాలపై నిగ్గు తేల్చేందుకు సుప్రీం కోర్టు నియమించిన ముగ్గురు సభ్యుల ప్యానల్ కు ముద్గల్ నేతృత్వం వహిస్తున్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, క్రీడల విషయానికొచ్చేసరికి బెట్టింగ్ అంశం చట్టవ్యతిరేకంగా కనిపిస్తోందన్నారు. 'మనం ఓ రేసు గుర్రం శక్తిపై పందెం కాస్తాం, ఓ జాకీ నైపుణ్యంపై పందెం కాస్తాం, కానీ సచిన్ ప్రతిభపై మాత్రం పందెం కాయలేం. భారత్ లో బెట్టింగ్ వ్యవస్థ వేళ్ళూనుకుంది. నిర్మూలించడం కష్టం. కనుక, దీనిని చట్టబద్ధం చేసి పన్నులు విధించడం ద్వారా భారీస్థాయిలో ఆదాయం ఆర్జించవచ్చు' అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News