: దాతృత్వానికి ఏటా 20 కోట్లు: రోహిణి నిలేకని
ప్రతి ఏటా 20 కోట్ల రూపాయలు దాతృత్వానికి వెచ్చిస్తానని సాఫ్ట్ వేర్ ప్రముఖుడు నందన్ నిలేకని సతీమణి రోహిణి నిలేకని వెల్లడించారు. పర్యావరణం, గుడ్ గవర్నెన్స్, సమన్యాయం, పారదర్శకత తదితర అంశాలపై పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు అందజేయనున్నట్టు ఆమె స్పష్టం చేశారు. ఆమె 2005 నుంచి ఇప్పటి వరకు 215 కోట్ల రూపాయలను పలు దాతృత్వకార్యక్రమాలకు వెచ్చించినట్టు తెలిపారు.