: రెండ్రోజుల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తాం: రాధ
మరో రెండ్రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్థరిస్తామని విపత్తు నిర్వహణ కమిషనర్ రాధ తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ, ఇతర ఉన్నతాధికారులతోనూ రాధ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, అక్కడక్కడ తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతోందన్నారు. పునరుద్ధరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక వ్యక్తి మృతి చెందారని అన్నారు.