: ఆలయంలో తొక్కిసలాట, భక్తుల మృతి
మధ్యప్రదేశ్ లోని రతన్ గఢ్ వద్ద ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. తొక్కిసలాట వల్ల ఆలయం పక్కనే ఉన్న నదిలో కొందరు భక్తులు పడిపోయారు. గల్లంతైన వారికోసం సహాయ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు.