: పైలిన్ ప్రభావంతో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు: రాథోడ్


ఫైలిన్ ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్ర, ఒడిశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ రాథోడ్ తెలిపారు. గోపాల్ పూర్ కేంద్రంగా ఫైలిన్ తుపాను 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని చెప్పారు. దీని ప్రభావంతో 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అన్నారు. రానున్న 24 గంటల్లో ఛత్తీస్ గఢ్, బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మీడియా ప్రసారం చేసిన వార్తాకథనాలతో ప్రజలు అప్రమత్తమై ప్రమాదం నుంచి తప్పించుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలో ఫైలిన్ ధాటికి పంటలు నాశనమైపోయాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. విద్యుత్, టెలిఫోన్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి.

  • Loading...

More Telugu News