: పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలి: థరూర్


రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడం తప్పేమీ కాదని కేంద్ర మంత్రి శశి థరూర్ అన్నారు. పాలనలో పారదర్శకత రావాలంటే ఈ చర్య తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడే ప్రజల్లో ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతుందన్నారు. తిరువనంతపురంలో సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన ఓ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు జీవనరేఖల్లాంటివని పేర్కొన్నారు. తమ కార్యకలాపాలన్నీ పారదర్శకమేనని చెప్పుకునే వామపక్ష నేతలు రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం కిందకు తేవడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకోవాలనుందని థరూర్ అన్నారు. ఇటీవల ఓ సర్వేలో అత్యధిక శాతం ప్రజలు నియంతృత్వ తరహా అధికారానికి మొగ్గు చూపడం చూస్తుంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న అభిప్రాయం కలుగుతోందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News