: రెడ్ అలర్ట్ ఉపసంహరణ
ఫైలిన్ తుపానుపై రెడ్ అలర్ట్ (ప్రమాద సంకేతం)ను భారత వాతావరణ శాఖ ఉపసంహరించుకుంది. కాగా, వచ్చే 12 గంటల పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. మరోవైపు, రానున్న 36 గంటల్లో ఒడిశా, ఛత్తీస్ గఢ్, ఉత్తరాంధ్రలో భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.