: చిగుళ్లలో సమస్యగా ఉందా...


మీ పంటి చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్య మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తుందా... అయితే చక్కగా తమలపాకుల వైద్యం చేయండి. ఇట్టే మీ సమస్య తీరుతుంది. పురాతన కాలం నుండి తమలపాకులను మనవారు ఆహారం తర్వాత తాంబూల సేవనం పేరుతో స్వీకరిస్తున్నారు. ఈ తమలపాకుల్లో పలు రకాల వైద్య సుగుణాలు ఉన్నాయి. కాబట్టే వాటిని కూడా ఆహారంలో భాగంగా... భోజనానంతరం తీసుకోవడం అలవాటుగా వస్తోంది. అయితే ఈ అలవాటు ఇప్పుడు తగ్గిపోయింది. ఎక్కువమంది తాంబూలం వేసుకోవడానికి సుముఖత చూపడంలేదు. కేవలం పండుగలు, సంప్రదాయ వేడుకల్లో మాత్రమే తమలపాకులు కనిపిస్తున్నాయి. కానీ ఈ తమలపాకుల్లో బోలెడు సుగుణాలున్నాయి.

మీకు విపరీతమైన దాహం కలిగినప్పుడు నీళ్లు తాగుతారు. అయినా ఒక్కోసారి మీ దాహార్తి తీరదు. ఇలాంటి సమయాల్లో తమలపాకుల గుజ్జుని పాలలో కలిపి తీసుకుంటే దాహం తీరుతుంది. తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తరచుగా తమలపాకుల్ని తీసుకోవడం వల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ బయటికి పోతాయి. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు తమలపాకుల్ని తినడం వల్ల ఈ సమస్యనుండి బయటపడవచ్చట. అలాగే చిగుళ్లనుండి రక్తం కారే సమస్యను తమలపాకులు తగ్గిస్తాయి. ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటే తమలపాకుల్ని ఉడికించి మెత్తగా చేసి ఆ గుజ్జుని చిగుళ్లకు రాస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే జలుబు, దగ్గుతో బాధపడేవారు తమలపాకులు ఉడికించి ఆ నీటిని తాగితే ఉపశమనం కలుగుతుంది. కాబట్టి తాంబూలాన్ని తేలికగా తీసిపారేయకుండా... చక్కగా తాంబూలసేవనం చేయడం వల్ల ఇన్ని సుగుణాలను మనం పొందవచ్చు.

  • Loading...

More Telugu News