: వేస్ట్ వాటర్‌తో వాహనం నడుస్తుందా?


ఇదివరలో ఇలాంటి మాటల్ని చెప్పే వాళ్లను పిచ్చాళ్ల కింద జమకట్టి పిచ్చాసుపత్రికి పంపేవాళ్లు. కానీ టెక్నాలజీ మన సమాజం మీద ఎంతగా దాడి చేస్తున్నదంటే.. ఇప్పుడు ఆ మాట చెబితే ఏమో అలా ఏమైనా జరుగుతుందేమో అని జనం ఓ క్షణం ఆగి ఆలోచిస్తున్నారు. జనం ఆలోచనలకు తగ్గట్లే శాస్త్రవేత్తలు కూడా కొత్త పరిశోధనల ద్వారా కొంగొత్త విషయాల్ని కనుగొంటున్నారు. వేస్ట్‌ వాటర్‌ను, అంతకంటే వేస్ట్‌ అయిపోతున్న సూర్యరశ్మిని కలిపి ఉపయుక్తంగా మార్చడం అందులో ఒకటి. వాహనం నడిపేదో కాదో గానీ.. ఈ రెండింటినీ కలిపి ఇంధనాన్ని తయారు చేయడం మాత్రం సాధ్యమైందిట.

శాంతాక్రజ్‌లోని కాలిపోర్నియా యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ యాట్‌ లీ ఆధ్వర్యంలో ఓ మిక్సింగ్‌ పరికరాన్ని కనుగొన్నారు. సూర్యరశ్మిలోని ఫోటో ఎలక్ట్రిక్‌ కెమికల్‌ సెల్‌లను, సూక్ష్మ ఇంధన కణాలను సమ్మిళితం చేసి ఈ పరికరం ఇంధన వాయువును తయారుచేస్తుందిట. ఇది ఎంఎఫ్‌సీలోని జీవపదార్థాన్ని బ్యాక్టీరియా తగ్గించి విద్యుదుత్పత్తి చేస్తుందట. దీనిని కాస్తా పీఈసీలో ప్రసరింపజేస్తే.. విద్యుద్విశ్లేషణ ద్వారా హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ తయారవుతాయి.

మొత్తానికి వ్యర్థాల్ని వాడుకోవడం, సహజ ఇంధనాల తయారీ దిశగా ఇదొక మెరుగైన ఆవిష్కరణ అని యాట్‌ లీ అంటున్నారు.

  • Loading...

More Telugu News