: సీఎంను పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయాలంటున్న ఎంపీ
సీఎం కిరణ్ పై ఎంపీ వివేక్ ధ్వజమెత్తారు. ఆయనను పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రకటన వెలువడిన వెంటనే భూ కబ్జాదారుడిలా మారారని ఆరోపించారు. తనకు అనుకూలమైన ఫైళ్ళను వెంటనే పరిష్కరిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. సాగునీరు, తాగునీరు దక్కవని, ఉద్యోగాలు లభించవని సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. విభజనకు సహకరించకుంటే చివరికి సీమాంధ్ర ప్రజలే నష్టపోతారని వివేక్ స్పష్టం చేశారు.