: 60 నేవీ టీంలను రంగంలోకి దించాం: మర్రి శశిధర్ రెడ్డి


తీవ్రరూపం దాలుస్తున్న ఫైలిన్ తుపాను నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జాతీయ విపత్తు నివారణ సంస్థ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే తీర ప్రాంతంలో 60 నేవీ టీంలు రంగంలో ఉన్నాయని అన్నారు. దీనికి సంబంధించిన 2300 మంది సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 20 మెడికల్ టీంలను అందుబాటులో ఉంచామని అన్నారు. ఇప్పటికే ప్రమాదకర ప్రాంతాల నుంచి ఐదు లక్షల మందిని తరలించామని తెలిపారు. కొంతమంది తమ ప్రాంతాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి పోవడానికి తిరస్కరిస్తున్నారని... వీరిని కూడా తరలించడానికి ప్రయత్నిస్తున్నామని శశిధర్ రెడ్డి వెల్లడించారు. తుపాను బాధితుల కోసం ఇప్పటికే ఐదు లక్షల టన్నుల ఆహార పదార్థాలను సిద్ధం చేశామని చెప్పారు. ఫైలిన్ తుపాను ప్రభావం పశ్చిమ బెంగాల్ పై కూడా ఉంటుందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News