: భారత మత్స్యకారుడిని పొట్టనబెట్టుకున్న పాక్ దళాలు


అంతర్జాతీయ జలాల్లో చేపలు పడుతున్న భారత మత్స్యకారుడిని పాకిస్థాన్ దళాలు పొట్టనబెట్టుకున్నాయి. మరో 30 మంది గుజరాత్ మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నాయి. గుజరాత్ తీరంలోని జకావు వద్ద ఈ ఘటన జరిగింది. నిన్న ఉదయం ధన్వంతి అనే ఫిషింగ్ బోట్లో సముద్ర జలాల్లో చేపలు పడుతున్న తమపై పాక్ సముద్ర భద్రత దళాలు అకారణంగా కాల్పులు జరిపాయని, నరన్ సోసా అనే మత్స్యకారుడు మరణించాడని పోర్ బందర్ బోట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మనీశ్ లొథారి తెలిపారు.

పాక్ దళాలు ఐదు బోట్లలో వచ్చాయని, కాల్పులు ప్రారంభం కాగానే తాము నీటిలోకి దూకేశామని లొథారి వెల్లడించారు. మిగతా మత్స్యకారులను పాక్ దళాలు పట్టుకుని వారి బోట్లలో తీసుకెళ్ళారని ఆయన వివరించారు. కాగా, ఈ విషయమై గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ట్విట్టర్లో డిమాండ్ చేశారు. తాను రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీతో ఇదే అంశంపై మాట్లాడానని మోడీ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News