: టీజీ వ్యాఖ్యలను ఖండించిన టీఆర్ఎస్


సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని మంత్రి టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ ఖండించారు. సహకార సంఘాల ఎన్నికలు రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా జరిగాయని అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన వినోద్, టీజీ వ్యాఖ్యలు అర్ధరహితమని విమర్శించారు. తెలంగాణలోని పది జిల్లాలకు గానూ ఏడు జిల్లాల్లో మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయన్న ఆయన, తెలంగాణలో సమైక్యాంధ్ర పేరుతో పోటీచేసి గెలవగలరా? అని సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News